Sunday, November 9, 2025
E-PAPER
Homeప్రత్యేకంఅక్టోబర్‌ విప్లవం రిమెంబరెన్స్‌ & రిలవెన్స్‌

అక్టోబర్‌ విప్లవం రిమెంబరెన్స్‌ & రిలవెన్స్‌

- Advertisement -

అక్టోబర్‌ విప్లవం ప్రపంచాన్ని తలకిందులు చేసిన ఒక్క రాత్రి! ఊహించుకోండి. 1917 నవంబర్‌ 7 అర్ధరాత్రి. పెట్రోగ్రాడ్‌ నగరం మంచుతో కప్పబడి ఉంది. రోడ్లపై రెడ్‌ గార్డ్స్‌ బూట్ల చప్పుడు మాత్రమే వినిపిస్తోంది. వింటర్‌ ప్యాలెస్‌ గేటు తెరుచుకుంది. ఒక్క గంటలోనే జార్‌ చక్రవర్తి సామ్రాజ్యం కూలిపోయింది. రాజు పారిపోయాడు. ప్రపంచంలోనే మొదటి కార్మిక-రైతు ప్రభుత్వం పుట్టింది!

ఇది సినిమా కాదు! ఇది అక్టోబర్‌ విప్లవం – చరిత్రలో ఎప్పుడూ జరగని మహ అద్భుతం!
ఎందుకు ఇంత స్పెషల్‌?
ఒక్క రోజులో రాజ్యం మారింది! ఫిబ్రవరి విప్లవం జార్‌ను పడగొట్టింది, కానీ పాత వ్యవస్థనే కొనసాగించింది. బోల్షెవిక్‌లు మాత్రం ఒక్క రాత్రిలో వింటర్‌ ప్యాలెస్‌, రైల్వే స్టేషన్‌, టెలిగ్రాఫ్‌ ఆఫీస్‌ ఇలా అన్నీ స్వాధీనం చేసుకున్నారు! విప్లవంలో చనిపోయినవారు కేవలం 6 మంది మాత్రమే! రక్తరహిత విప్లవం అంటే ఇదే!
కింది నుంచి పైకి అధికారం!
”అధికారం సోవియెట్‌లకు!” అని లెనిన్‌ గర్జించాడు. సోవియెట్‌ అంటే ఏంటి? ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు, సైనికులు తమ ప్రతినిధుల్ని ఎన్నుకున్న సంఘాలే సోవియట్లు, ఆ విధంగా మొదటిసారిగా ప్రజలే పాలకులయ్యారు!

మహిళలే మొదటి దళం!
ఫిబ్రవరి విప్లవం మొదలైంది బ్రెడ్‌ కోసం రోడ్డెక్కిన టెక్స్‌టైల్‌ మహిళలతోనే. అక్టోబర్‌లో మహిళా రెడ్‌ గార్డ్స్‌ తుపాకులు పట్టుకుని పోరాడారు. అలెగ్జాండర్‌ కొల్లొంతారు ప్రపంచంలోనే మొదటి మహిళా మంత్రి!
ఏం సాధించారు?
ఒక్కసారి చూడండి! భూస్వాముల చేతిలోని 15కోట్ల ఎకరాలా భూమి ఉచితంగా రైతుల చేతికి వచ్చింది. ఫ్యాక్టరీలు కార్మికులవే, యజమానులు కార్మికులే, ఫ్యాక్టరీలపై సర్వాధికారాలు కార్మికులకే, 8 గంటల డ్యూటీ, పూర్తి బీమా, సెలవులు, ఏం ఉత్పత్తి చేయాలి, ఎంత ఉత్పత్తి చేయాలనేది నిర్ణయం తీసుకునేది కార్మికులే. యజమానుల కోసం కాకుండా, కార్మికులు తమ కోసం తాము పని చేసుకోవడం అనేది ఒక అద్భుతమైన విషయం. మహిళల బానిస బంధనాలు తెగిపడ్డాయి, అణిచివేసే సాంప్రదాయ అడ్డుగోడలు కూలిపోయాయి. మహిళలకు స్వేచ్ఛ లభించింది. ఉచిత విద్య అందించారు, వివాహం, విడాకులు తదితర అంశాలపై వారికే స్వయం నిర్ణయాధికారం చట్టబద్ధం చేయబడింది.

అక్షరాస్యతలో అసమాన ప్రగతి. అక్షరాస్యత 30 శాతం నుంచి 94 శాతానికి పెరిగింది. పుస్తకాలు ఉచితం, స్కూళ్లు ఉచితం! అందరికీ ఉద్యోగం, ఇల్లు, ఆసుపత్రి డబ్బు లేకుండా చికిత్స! 1939 నాటికి సోవియట్‌ యూనియన్‌ ప్రపంచంలోనే అతి త్వరగా అభివద్ధి చెందిన దేశంగా అవతరించింది! పెట్టుబడిదారీ వ్యవస్థ ద్వారా అమెరికా 300ఏళ్ళలో సాధించిన అభివద్ధిని సోషలిస్టు రష్యా 30 ఏళ్ళలో సాధించింది. ఈ ప్రగతి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది, సోషలిజం వైపు చూసేలా చేసింది. ఇవన్నీ అక్టోబర్‌ విప్లవం మానవజాతి చరిత్రలో సాధించిన ఘన విజయాలు.

ప్రపంచాన్ని ఎలా కదిలించింది?
రష్యా అక్టోబరు విప్లవ స్ఫూర్తితోనే భారత స్వాతంత్య్రం వీరుడు భగత్‌ సింగ్‌ ”ఇంక్విలాబ్‌ జిందాబాద్‌” నినాదం ఇచ్చారు. చైనా, వియత్నాం, క్యూబా, విప్లవాలకు బాటలు వేసింది! రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలపై విజయం సాధించి ప్రపంచాన్ని ఫాసిజం ప్రమాదం నుండి కాపాడింది. దీనికోసం 2.7 కోట్ల మంది సోవియట్‌ ప్రజలు ప్రాణాలు త్యాగం చేశారు! తూర్పు యూరప్‌ దేశాలను పెట్టుబడిదారి కోరల నుండి విముక్తి చేసింది.

అనేక దేశాలు సామ్రాజ్యవాద విషకౌగిలి నుండి విముక్తి పొంది స్వతంత్ర దేశాలుగా అవతరించేలా ప్రభావం వేసి, వలసలే లేని ప్రపంచాన్ని ఆవిష్కరించింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అనూహ్యమైన ప్రగతిని సాధించింది.అంతరిక్షంలోకి మొదటి మనిషిని పంపించింది, ఆయనే గగారిన్‌. 20 ఏళ్లలో సూపర్‌ పవర్‌గా మారింది. ఇది సోషలిజం శక్తి! అక్టోబర్‌ విప్లవం నేటికీ కూడా ఎందుకు మనకు ప్రాసంగికం? ఇప్పుడు కూడా 1% ధనికుల దగ్గర 50% సంపద ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యువతకు ఉద్యోగాలు లేవు.

అక్టోబర్‌ విప్లవం ఒక్కటే చెబుతోంది!
”మీరు ఆకలితో ఉంటే, దోపిడీకి గురైతే – తిరుగుబాటు చేయండి! ఎందుకంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, చరిత్ర మీ చేతనే రాయబడుతుంది!” లెనిన్‌ చివరి మాటలు: ”మీరు ఒక్కసారి తిరుగుబాటు చేస్తే… ప్రపంచం ఎప్పటికీ పాత రూపంలో ఉండదు.” అక్టోబర్‌ విప్లవం ఆ మాట నిజం చేసింది. మనకు మార్గం చూపుతుంది. అందుకే అక్టోబర్‌ విప్లవం అజరామరం!

ఎం.డి అబ్బాస్‌
9030098032

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -