- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో మండల కమిటీని ఇన్చారర్జ్ కోడూరు లింగయ్య ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఓదెలు, ప్రధాన కార్యదర్శిగా పోతుగంటి రమేష్,ఉపాధ్యక్షులుగా చెన్నూరి దేవదానం, యాషాడపు సతీష్ ,కోశాధికారిగా చెన్నూరి సంతోష్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఓదెలు మాట్లాడుతూ.. కుమ్మరులా ఐక్యతకు కులస్తుల అందరిని ఏకతాటి మీదికి తీసుకురావడంతో పాటు సంఘం బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా భాద్యుల సహకారంతో మండల కమిటీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా భాద్యులు ఇటుకాల రమేష్,కాసర్ల మల్లయ్య పాల్గొన్నారు.
- Advertisement -