హైదరాబాద్ 109/4
నవతెలంగాణ-హైదరాబాద్
కల్నల్ సికె నాయుడు ట్రోఫీ ఎలైట్ (అండర్-23) గ్రూప్ మ్యాచ్‌లో ఒడిశాను హైదరాబాద్ బౌలర్లు 159 పరుగులకే ఆలౌట్ చేశారు. ఉప్పల్ స్టేడియంలో గురువారం ఆరంభమైన మ్యాచ్‌లో ప్రణవ్ వర్మ (4/25), శశాంక్ (4/44) నాలుగు వికెట్ల ప్రదర్శనతో చెలరేగటంతో 52 ఓవర్లలో 159 పరుగులకే ఒడిశా తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. ఆ జట్టులో ఓపెనర్ శశాంక (37), ఆయుశ్ (31), భరద్వాజ్ (28), సౌమ్య రంజన్ (27) రాణించారు. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో 109/4తో కొనసాగుతుంది. ఆమన్ రావు (55 నాటౌట్, 91 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో కదం తొక్కగా.. శశాంక్ (0 నాటౌట్) అజేయంగా క్రీజులో నిలిచాడు. రాఘవ (15), అవనీశ్ (20), మయాంక్ (13), చిరాగ్ యాదవ్ (5) నిరాశపరిచారు. హైదరాబాద్ తొలి ఇన్నిగ్స్‌లో మరో 50 పరుగుల వెనుకంజలో నిలిచింది.