నవతెలంగాణ – సదాశివ నగర్: అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని రాష్ట్ర హ్యూమన్ రైట్స్ సలహాదారు కేతు రమణారెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలోని వెన్నెల యూత్ క్లబ్ 22 వ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ సంస్కృతిలో భాగంగా వినాయక చవితి సందర్భంగా వేలాదిమందికి గణేష్ మండపాల నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో మోసర్ల శ్రీకాంత్ రెడ్డి, అడ్వకేట్ ఈక శ్రీనివాస్ రావు,వెన్నెల యూత్ క్లబ్ సభ్యులు టి. రఘు, కె. అశోక్, అర్. నవీన్, ఎం. హరీష్, టి. బద్రి, జి. నవీన్, ఎం. యస్వంత్ రెడ్డి. టి. భారత్, టి. సతీష్,. కె. రాము తదితరులు పాల్గొన్నారు.
అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES