Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పది

అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పది

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పది అని నిజాంబాద్ నార్త్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంజయ్ గౌడ్ అన్నారు నగరంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో హంగర్ ఫ్రీ వరల్డ్ ( ఆకలి లేని ప్రపంచం ) నిర్మించాలన్నది. సంస్థ చైర్మన్ ఎంపీ అహ్మద్ లక్షమని అందుకు ఆ సంస్థ హంగర్ ఫ్రీ వరల్డ్  ఏర్పాటుచేసి సంవత్సరం అవుతున్నందున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ యజమాని ఆకలి లేని ప్రపంచం కోసం ఆయన పాటు పాడటం సంతోషికారమైన విషయమే అని, ఆ సంస్థకు వచ్చిన లాభం నుంచి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఉత్తమమైనదని అన్నారు.

అదేవిధంగా అటవీ శాఖ అధికారి పర్యావరణ దినోత్సవం జూన్ 5న ఉన్నందున అందరూ ప్లాస్టిక్ వాడకండి తగ్గించాలని పర్యావరణాన్ని పరిరక్షించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్టోర్ ఇన్చార్జ్ అక్షయ్, ప్రశాంత్ మాట్లాడుతూ  నిజామాబాద్ నగరంలో సంవత్సరం నుండి సుమారు 400  మందికి ఆహారం, సాయంత్రం సమయంలో రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతంలో అదేవిధంగా నగరంలోని నిరస్రయులకు ఆహారాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా సంస్థకు వచ్చే లాభాలలో నుండి 2 శాతమే కాకుండా 5 శాతం పేద ప్రజలకు, నిరుపేదలకు ఆహారం, విద్య వంటి వాటికి ఖర్చు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ కు సంబంధించిన ఉద్యోగస్తులు, నగర ప్రజలు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -