Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులతో భేటీ అయిన అధికారి

రైతులతో భేటీ అయిన అధికారి

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
“ఆగని మూగజీవాల మరణాలు” అనే కథనాన్ని నవతెలంగాణ ఈనెల 22న ప్రత్యేకంగా ప్రచురించిన నేపథ్యంలో జిల్లా పశువైద్య అధికారి జ్ఞానశేఖర్ స్పందించారు. మంగళవారం ఆయన ఉప్పునుంతల మండలంలోని రాయిచెడు, వెల్టూరు గ్రామాలను సందర్శించి, చనిపోయిన పశువుల యజమానులను పరామర్శించారు. బాధిత రైతు కుట్ర లక్ష్మయ్యతో నేరుగా మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పశువైద్యులకు పశువుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. మరుసటి రోజు నుంచే పశువులకు వ్యాక్సిన్ కార్యక్రమాలు ప్రారంభించేలా కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -