Sunday, May 25, 2025
Homeజిల్లాలుఅధికారులు అప్రమత్తంగా ఉండాలి..

అధికారులు అప్రమత్తంగా ఉండాలి..

- Advertisement -

ఎంపీడీవో సుమన వాణి
వర్షాకాలంలో ప్రమాదాలు జరగకుండా మండల్ లెవెల్ అధికారులతో అవగాహన సమావేశం
నవతెలంగాణ – తాడ్వాయి 
: రాబోయే వర్షాకాలం సీజన్లో మండల ప్రజలకు ఇలాంటి ప్రమాదాలు, ప్రాణ, ఆస్తి నష్ట సమస్యలు తలెత్తకుండా మండల స్థాయి ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండాలని,  మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) సుమన వాణి అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో రాబోయే వర్షకాలంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి, మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సుమన వాణి మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ముందుగా తీసుకోవలసిన జాగ్రత్తలపై మండల స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షం ఉరుములు, విద్యుత్ ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, సీజనల్ వ్యాధులు ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయన్నారు. ముఖ్యంగా మండలంలో సీజన వ్యాధులపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాకాలంలో దోమలు, మలేరియా, డెంగ్యూ, డయేరియా లాంటి ఇతర వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందన్నారు. విద్యుత్ ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలుంటాయన్నారు. వాగులు, వొర్రెలు పొంగిపొర్లినప్పుడు, వరదలు సంభవించినప్పుడు ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏదేమైనా వర్షాకాలంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా మండల స్థాయి ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, మండల వైద్యాధికారి ఆడెపు చిరంజీవి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నవీన్, మలేరియా అధికారి దుర్గా రావు, ఐబీ డి ఈ సదయ్య, ఐ బి ఏ ఈ ప్రశాంత్, మండలంలోని వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -