Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పోచారం ప్రాజెక్టు కట్ట బలోపేతంలో అధికారులు సైతం...

పోచారం ప్రాజెక్టు కట్ట బలోపేతంలో అధికారులు సైతం…

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
గత రెండు రోజులుగా భారీ వర్షాల కారణంగా పోచారం ప్రాజెక్టు లోకి 1,80, వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో ప్రాజెక్ట ప్రక్కన పెద్ద లోయ ఏర్పడింది. ఎమ్మెల్యే ఆదేశానుసారం అధికార యంత్రాంగం ఎల్లారెడ్డి ఆర్ డి వో పార్థసింహారెడ్డి, డి.ఎస్.పి శ్రీనివాస్, సిఐ రాజారెడ్డి, కట్ట పలుపేతానికి అవసరమైనటువంటి మట్టి సంచులను నింపారు. కోతకు గురైన లోయలో జెసిబి ల సహాయంతో మట్టిని నింపారు. లోయను నింపడంతో పాటు కట్టను బలోపేతం చేయడానికి మట్టి సంచులను పేర్చారు. దిగువ ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలని కట్టను బలోపేతం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వారి వెంట తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్సై భార్గవ్ గౌడ్, డి ఈ ఈ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు రెడ్డి, సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, విక్రాంత్ రెడ్డి, వెంకటరామ్ రెడ్డి, ఇమామ్, షాయద్ పాషా, మురళీగౌడ్ కిరణ్, సురేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad