Thursday, March 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి పనులపై అధికారులు పర్యవేక్షణ..

అభివృద్ధి పనులపై అధికారులు పర్యవేక్షణ..

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్ ( రాజంపేట్ ) : రాజంపేట్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గురువారం అధికారులు పరిశీలించారు. సిద్ధాపూర్ గ్రామంలోని ఎన్ఆర్ఈజీఎస్ పనులను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న పశువుల షెడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. నడిమి తండా గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల మార్కౌట్ కార్యక్రమంలో అధికారులు పాల్గొని వాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ట్రెంచ్ నిర్మాణ పనులను పరిశీలించారు. శివాయిపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలకృష్ణ, డిప్యూటీ తాసిల్దార్ శృతి, ఎస్సై రాజు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మయ్య, సర్పంచులు పూర్ణచందర్, లక్ష్మి, గోదావరి, సంధ్యా బాల్ రాజ్, పంచాయతీ కార్యదర్శులు వసంత, లావణ్య, చంద్రశేఖర్, అరుణ్, జి పి ఓ లు, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -