Thursday, September 11, 2025
E-PAPER
Homeజిల్లాలుపారిశధ్ద్య కార్మికులపై అధికారుల చిన్నచూపు

పారిశధ్ద్య కార్మికులపై అధికారుల చిన్నచూపు

- Advertisement -
  • – వర్షంలో సైతం చెత్త తొలగింపు
    – కార్మికులపై చిన్నచూపు తగదు: బిగుళ్ల మోహన్
  • నవతెలంగాణ-బెజ్జంకి
  • గ్రామ పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికులది కీలకపాత్ర. వారికి ప్రభుత్వం అందించేది ఆరకొర వేతనాలే. సమయానికి వేతనాలందకపోయినా.. పస్తులుంటూ నిత్యం విధులు నిర్వర్తిస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు. గురువారం మండల కేంద్రంలో వర్షంలో సైతం పారిశుద్ధ్య కార్మికులు చెత్తను తొలగించడం పలువురి ఆశ్చర్యపరించింది. రూ.లక్షల్లో వేతనాలందుకునే అధికారులు తమ కార్యాలయం అవరణం దాటి వెళ్లడకుండా విధులు నిర్వర్తిస్తున్నారని..ఆరకొర వేతనాలందుకునే కార్మికులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తున్నారని పలువురు కితాబిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులపై అధికారులకు పట్టింపేలేదని పలువురు వాపోతున్నారు.

కార్మికులపై చిన్నచూపు తగదు

పారిశుద్ధ్యంలో కార్మికుల సేవలను అందరూ ప్రశంసించాల్సిందే. ఎస్సీ సామాజిక వర్గాల వారే అధికంగా పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అధికారులు వారిపై చిన్నచూపు తగదు. వర్షాన్ని సైతం లేక్కచేయకుండా పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తించడం వారి అంకితభావం..నిబద్ధతకు నిదర్శనం. పారిశుద్ధ్య కార్మికులను అధికారులు ఆదర్శంగా తీసుకుని విధులు నిర్వర్తిస్తే సంతోషం. – బిగుళ్ల మోహన్, బీఆర్ఎస్ యువజనాధ్యక్షుడు బెజ్జంకి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -