తేమ శాతం 8నుంచి 12 వరకు మాత్రమే ఉండాలి..
నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ లోని నగేష్ జిన్నింగ్ మిల్లులో సోమవారం సీసీఐ ఆధ్వర్యంలో ప్రభుత్వం పత్తి కొనుగోళ్లును జిల్లా అధికారి గజానాన్ సీపీఓ వెంకటేశ్వర్లు కొనుగోళ్లు కేంద్రాన్ని ప్రారంభించారు. ముందుగా జిన్నింగ్ మిల్లులోని తూకలా యంత్రాలకు, తీసుకువచ్చిన ఎడ్ల బండి కి ప్రత్యేక పూజలు చేసి తూకం చేశారు. మండలంలోని ఫార్డి కే గ్రామానికి చెందిన సురేష్ అనే రైతుకు శాలవతో సన్మాంచారు. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా మార్కెట్ అధికారి గజానాన్ మాట్లాడుతూ .. రైతులు మార్కెట్ కు తీసుకువచ్చేటప్పుడు తప్పపని సరిగా తేమ శాతం 8నుంచి 12వరకు ఉండేలా చూసుకోవాలని సూచించారు.
అదేవిదంగా కిసాన్ కాపాస్ యాప్ ద్వారా నమోదు చేసుకున్న తరవాతే మార్కెట్ కు తీసుకురావాలని అన్నారు. దింతో రైతులు ఒక్కసారిగా తేమ శాతంలో మినహాయింపు ఇవ్వాలని అధికారులతో వాదనకు దిగారు. నెల రోజుల నుంచి ఏకాదటిగా ప్రతి రోజు వర్షాలు కురావడం జరుగుతుంది. ఎలా అరబెట్టి ధాన్యాన్ని తీసుకురావాలని అధికారులను నిలదీశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కొనుగోళ్లు చేస్తామని అధికారులు రైతులకు స్పష్టం చేశారు. ఎవరికీ కూడా వెసులుబాటు లేకుండా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివరాజ్, ఎడిఏ వీణ, మండల వ్యవసాయ అధికారి సారిక, మార్కెట్ కమిటీ చేర్మెన్ కళ్యాణ్, ఆత్మ కమిటీ చేర్మెన్ సిద్ధం వివేకానంద, వ్యాపార వేత్తలు సంతోష్ , ఆనంద్, మండల నాయకులు పత్తి రైతులు తదితరులు ఉన్నారు.



