నవతెలంగాణ -ముధోల్ : ముధోల్ మండలం లో ని ఎడ్ బిడ్ గ్రామం తోర్ చెరువు ను ఎంపిడిఓ శివకుమార్, ఇరిగేషన్ ఏఈఈ దేవేందర్, ఆర్ఐ నారాయణ రావు పటేల్ ఆదివారం పరిశీలించారు. గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలతో చెరువు పూర్తిగా నిండి, ప్రమాధ అంచుకు చేరింది. దీంతో ఈవిషయం ను వరద సమస్యలపై నిర్మల్ కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ స్థానికులు పిర్యాదు చేశారు.దీంతో సంబంధిత అధికారులు వేళ్ళి చెరువు ను పరిశీలించారు.ముందు జాగ్రత్త చర్య గా చెరువు కు గండి పడకుండా ఇసుక బస్తాలు నింపి వేస్తామని అధికారులు పేర్కొన్నారు. గతంలో మీషన్ కాకతీయ పధకంలో చెరువు పనులు సక్రమంగా చేయకపోవడం తో ఈ సమస్య తలెత్తిందని పలువురు ఆరోపించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల గంగారెడ్డి, ఆయకట్టురైతులు , స్థానికులు, పాల్గొన్నారు.
తోర్ చెరువు ను పరిశీలించిన అధికారులు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES