Thursday, February 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం కప్ పోటీలను ప్రారంభించిన అధికారులు

సీఎం కప్ పోటీలను ప్రారంభించిన అధికారులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత క్రీడలను ప్రోత్సహించాలని ఉద్దే శంతో సీఎం కప్ ఆటల పోటీలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా గురువారం జుక్కల్ మండల కేంద్రంలోని  జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మండల విద్యాధికారి తిరుపతయ్య  అధ్యక్షతన ఎంపీడీవో శ్రీనివాస్ ఆటల పోటీలను ప్రారంభించారు. ముందుగా ఎంపిడిఓ  వాలిబాల్ ఆటను తాను విద్యార్థులతో కలిసి ఆడి పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈఓ ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామాలలో ఆణిముత్యాలు వంటి క్రీడాకారులు ఉన్నారని అన్నారు. విద్యార్థిని, విద్యార్థులు వారి నైపుణ్యతను చాటుకునేందుకు ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు తెలిపారు. పోటీల్లో ప్రతిభను కనబర్చిన వారు మండల స్థాయి, నియోజకవర్గస్థాయి, జిల్లా స్థాయి, జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం  లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఈఓ తిరుపతయ్య జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల హెచ్ఎం హనుమంత రెడ్డి, పాఠశాల పీఈటీ,  ఉపాధ్యాయ బృందం, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -