Tuesday, January 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధికారులు జవాబుదారితనంగా ఉండాలి

అధికారులు జవాబుదారితనంగా ఉండాలి

- Advertisement -

ఆర్టిఐ క్యాలెండర్ ఆవిష్కరణలో మహదేవపూర్ సిఐ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రభుత్వ అధికారులు జవాబుదారీతనంగా ఉండాలని మహాదేవపూర్ సిఐ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ 2026 నూతన క్యాలెండర్ ను మహాదేవపూర్ పోలీస్ స్టేషన్లో సిఐ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాచార హక్కు చట్టం అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గ్రామాల అభివృద్ధికి, పాలనలో పారదర్శకత స.హ చట్టంతోనే సాధ్యమన్నారు. సహచట్టం సామాన్యుడికి ఒక వజ్రాయుదం లాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ కాటారం సబ్ డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్, జిల్లా కమిటీ సభ్యుడు ముక్కెర వెంకటస్వామి గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -