- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మహాత్మగాంధి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా తాడిచెర్ల గ్రామానికి చెందిన దండు రమేష్ నియామకమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మొదటిసారిగా మండల పరిషత్ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా శుక్రవారం మండల ప్రత్యేక అధికారి విజయ్ కుమార్, ఎంపిడిఓ శ్రీనివాస్, ఉపాధిహామీ ఎపిఓ గిరి హరీష్,కార్యదర్శి మళ్ళీఖార్జున్ రెడ్డి,ఉపాధిహామీ సిబ్బంది శాలువాతో ఘనంగా ఆత్మీయు సన్మానం నిర్వహించి, భారత రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ చిత్ర పఠాన్ని బహుకరించారు.
- Advertisement -