– మండల వ్యవసాయ అధికారి కళ్యాణి
నవతెలంగాణ -టేకుమట్ల: మెంథాన్ తుఫాను ప్రభావంతో చలివాగు పరివాహ ప్రాంతాలలో నీట మునిగిన వరి పొలాలను మండల వ్యవసాయ అధికారి ఎం కళ్యాణి పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో మండల వ్యాప్తంగా చలివాగు చుట్టుపక్కల వరి పొలాలు వరద ఉధృతికి నీట మునిగడంతో జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు శనివారం మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో చలి వాగు చుట్టుపక్కల వరి పొలాలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 1440 ఎకరాల వరి పొలాలు నీట మునిగి పంట నష్టం జరిగినట్లు తెలిపారు. ప్రాథమిక నివేదిక పైఅధికారులకు పంపినట్లు ఆమె తెలిపారు.మండలంలో నేటి నుండి అన్ని గ్రామాలలో వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులతో సర్వే నిర్వహించి రైతుల పంట నష్టం వివరాలు సేకరించి వారి పేర్లు విస్తీర్ణం, సర్వేనెంబర్ తో సహా మూడు రోజులలో జిల్లాకు అధికారులకు పంపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ విస్తరణ అధికారులు డి భరత్, ఏం రాహుల్, మండల వ్యవసాయ అధికారి ఎం కళ్యాణి, రైతులు పాల్గొన్నారు.
మైథాన్ తో దెబ్బతిన్న పంటలను సర్వే చేపట్టిన అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



