- Advertisement -
ననవతెలంగాణ – భిక్కనూర్ ( రాజంపేట్ )
రాజంపేట్ మండలంలోని రాజంపేట్, శివాయిపల్లి, పొందుర్తి గ్రామాల్లో శనివారం ఎంపిడిఓ బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా రాజంపేట్, పొందుర్తి గ్రామంలో నర్సరీని సందర్శించి, కుక్కలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. శివాయిపల్లి గ్రామంలో నిర్వహించిన హెల్త్ క్యాంప్‌ను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే రాజంపేట్ రైతు వేదికలో వార్డు సభ్యుల రెండో దశ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ, సర్పంచులు, పంచాయతి కార్యదర్శులు, వెటర్నరీ డాక్టర్ అనిల్ రెడ్డి, టీఓటీలు, వార్డు సభ్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


