Wednesday, April 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ నిర్మాణాల వైపు కన్నెత్తి చూడని అధికారులు

అక్రమ నిర్మాణాల వైపు కన్నెత్తి చూడని అధికారులు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం

కాటారం మండలం కొత్తపల్లి (సుందరాజ్‌పేట్) గ్రామపంచాయతీలో అక్రమ నిర్మాణాలు విస్తృతంగా కొనసాగుతున్నప్పటికీ, వాటి వైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు  అనుమానాలకు తావిస్తోంది. అధికారుల కళ్లముందే అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా, ఎలాంటి చర్యలు లేకపోవడం స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

గ్రామంలో ఎక్కడ చూసినా కొత్తగా ఇళ్లు, దుకాణాలు నిర్మాణంలో ఉన్నాయి. పంచాయతీ అనుమతులు, భవన నిబంధనలు అన్నవి పూర్తిగా పక్కన పెట్టి నిర్మాణాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రోడ్లకు అతి సమీపంగా, కొన్నిచోట్ల ప్రభుత్వ భూములపై నిర్మాణాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

ఈ వ్యవహారంపై అధికారులు మాత్రం మౌనం పాటించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. “అక్రమ నిర్మాణాలు కనిపించవా? లేక కనిపించినా పట్టించుకోవడం లేదా?” అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొందరు స్థానికులు అయితే అధికారుల నిర్లక్ష్య వైఖరి వెనుక మరేదైనా కారణాలున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సాధారణ ప్రజలు చిన్న చిన్న పనుల కోసం అనుమతులు పొందేందుకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుండగా, పెద్ద స్థాయిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

ఈ నేపథ్యంలో గ్రామస్తులు తక్షణమే తనిఖీలు నిర్వహించి, అక్రమ నిర్మాణాలను నిలిపివేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే కొత్తపల్లి గ్రామపంచాయతీ పూర్తిగా అక్రమ నిర్మాణాల కేంద్రంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -