- Advertisement -
నవతెలంగాణ – జన్నారం: జన్నారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో రెండు అర్జీలను మండల అధికారులు స్వీకరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సమస్యలు, పింఛన్, ఇందిరమ్మ ఇల్లు తదితర వాటిపై అధికారులకు అర్జీలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమర్ షరీఫ్, తహశీల్దార్ రాజ మనోహర్ రెడ్డి, పలు శాఖల అధికారులు ఉన్నారు.
- Advertisement -