Saturday, September 20, 2025
E-PAPER
Homeసినిమా'ఓజీ'.. స్పెషల్‌ సర్‌ప్రైజ్‌

‘ఓజీ’.. స్పెషల్‌ సర్‌ప్రైజ్‌

- Advertisement -

‘ఓజీ’ సినిమా కోసం పవన్‌ కళ్యాణ్‌ జపనీస్‌లో స్వయంగా పాడిన ‘వాషి యో వాషి’ అనే ప్రత్యేక గీతాన్ని తాజాగా చిత్ర బృందం విడుదల చేసి, అందర్నీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఈ సర్‌ప్రైజ్‌తో పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఇప్పటికే ‘వాషి యో వాషి’ అంటూ సామజిక మాధ్యమాలు మారుమోగిపోతున్నాయి. విడుదలైన క్షణాల్లోనే శ్రోతల మన్ననలు పొందుతూ ఈ గీతం సంచలనాలు సష్టిస్తోంది. అభిమానులు దీనిని ‘మెగా విందు’ అని అభివర్ణిస్తున్నారు. తమన్‌ స్వరకర్తగా వ్యవహరిస్తున్న ‘ఓజీ’ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన గీతాలన్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన ‘వాషి యో వాషి’ గీతం వాటిని మించేలా, మరింత శక్తివంతంగా ఉంది. తమన్‌ మ్యూజిక్‌, పవన్‌ కళ్యాణ్‌ అద్భుతమైన గాత్రం కలిసి ‘వాషి యో వాషి’ని మరుపురాని గీతంగా మలిచాయి. సుజీత్‌ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్‌ దాసరి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -