హీరో రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబోలో సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. తాజాగా మేకర్స్ మూడవ ట్రాక్ ‘వామ్మో వాయ్యో’ను వరంగల్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో లాంచ్ చేశారు. డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ,’అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది’ అని తెలిపారు. ‘మీ ఎనర్జీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ఎనర్జీ ఈ సాంగ్‌లో ఉంది. రవితేజ ఫెంటాస్టిక్ డాన్సర్. ఇదొక గ్రేట్ ఎనర్జీ మాస్ నెంబర్’ అని హీరోయిన్ ఆషికా రంగనాథ్ చెప్పారు. మరో హీరోయిన్ డింపుల్ హయాతి మాట్లాడుతూ,’ఇది మాకు చాలా స్పెషల్ సాంగ్. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. చాలా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు. ఈ చిత్రానికి డీఓపీ : ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్ చాగంటి.
‘వామ్మో వాయ్యో..’ సందడి మొదలైంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



