Sunday, March 8, 2026
E-PAPER
Homeబీజినెస్100 డాలర్ల మార్క్‌కు చమురు..!

100 డాలర్ల మార్క్‌కు చమురు..!

- Advertisement -

న్యూఢిల్లీ : హర్మూజ్‌ జలసంధి గుండా నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరు కోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్‌పై అమానుషంగా అమెరికా, ఇజ్రాయిల్‌ సృష్టించిన యుద్ధం కారణంగా ఈ కీలక మార్గంలో రవాణా స్తంభించడంతో సరఫరా గొలుసు దెబ్బతిన్నది. ఇప్పటికే బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు ఈ వారంలోనే 25 శాతం పెరిగి 90 డాలర్ల మార్కును దాటేశాయి. ఇరాక్‌ తన చమురు ఉత్పత్తిని తగ్గించడం, ఖతార్‌ ఎల్‌ఎన్‌జి ఉత్పత్తిని నిలిపివేయడం వంటి పరిణామాలు గ్లోబల్‌ మార్కెట్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రతిష్టంభన మరికొన్ని వారాలు కొనసాగితే, చమురు ధరల పెరుగుదల వల్ల ప్రపంచవ్యాప్తంగా రవాణా ఖర్చులు పెరిగి, నిత్యా వసర వస్తువుల ధరలు సామాన్యుడికి భారంగా మారే ప్రమాదం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -