- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గల్ఫ్ యుద్ధం భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. కొన్ని నెలల క్రితం లీటర్ రూ.150 ఉన్న సన్ఫ్లవర్ ఆయిల్ ధర ఇప్పుడు రూ.190-202కు చేరింది. వేరుశనగ నూనె లీటర్ రూ.220, పామాయిల్ రూ.150, ఆవనూనె రూ.190కు పెరిగాయి. రూపాయి విలువ పతనం కూడా ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
- Advertisement -



