సింగపూర్ : ప్రపంచంలోనే ప్రధాన చమురు ఎగుమతిదారు సౌదీ అరామ్కో ఆసియాకు ఏప్రిల్‌లో వరుసగా రెండవ నెల కూడా ఆసియాకు చమురు సరఫరాను తగ్గించినట్లు సంబంధిత వర్గాలు సోమవారం తెలిపాయి. ఏప్రిల్‌లో యాన్బులోని రెడ్‌సీ పోర్ట్ నుండి ఎగుమతి అయిన అరబ్ లైట్ క్రూడ్‌ను మాత్రమే సరఫరా చేయనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆసియా రిఫైనరీలకు సరఫరా తగ్గనుండటంతో శుద్ధి చేసిన ఉత్పత్తులపై పరిమితులు మరింత తీవ్రం కానున్నాయి. ఈ వార్తపై అరామ్కో స్పందించాల్సివుంది. సౌదీ అరేబియా మార్చిలో రోజుకి 4.355మిలియన్ బ్యారెల్స్‌ను ఎగుమతి చేసినట్లు క్ప్లెర్ సంస్థ తెలిపింది. రోజుకి 7.108 మిలియన్ బ్యారెల్స్‌ను ఎగుమతి చేసిన ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఎగుమతి తగ్గినట్లు సంస్థ పేర్కొంది. హార్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాన్ని భర్తీ చేసేందుకు అరామ్కో సంస్థ యాన్బు పోర్ట్ నుండి ముడి చమురు ఎగుమతిని పెంచేందుకు యత్నిస్తోంది. దీంతో మార్చిలో లోడింగ్ రికార్డు స్థాయికి పెరుగుతాయని అంచనావేస్తోంది. చైనా సంస్థ సినోపెక్, మార్చిలో యాన్బు పోర్ట్ నుండి సుమారు 24 మిలియన్ బ్యారెళ్ల సౌదీ ముడిచమురును పంపిణీ చేసేందుకు యత్నిస్తోంది. సౌదీ అరామ్కోకి చెందిన సమ్రెఫ్ రిఫైనరీ సమీపంలో ఒక డ్రోన్ కూలిపోవడంతో, గురువారం (మార్చి 19న ) యాన్బు పోర్ట్‌లో చమురు లోడింగ్‌కు కొంతసేపు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే.
ఏప్రిల్‌లోనూ ఆసియాకు తగ్గనున్న చమురు సరఫరా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



