Thursday, February 26, 2026
E-PAPER
Homeజాతీయంపాత నేతలు శాశ్వతం కారు

పాత నేతలు శాశ్వతం కారు

- Advertisement -

కొత్త తరాన్ని ఆహ్వానించాల్సిందే కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు
బెంగళూరు :
కర్నాటక మంత్రివర్గంలోకి యువ రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పాతతరం నేతలు శాశ్వతంగా కొనసాగలేరని, పార్టీ భవిష్యత్తు కోసం కొత్త ఆలోచనలు అవసరమని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో శివకుమార్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో తమకూ అవకాశం కల్పించాలని కోరుతూ తొలిసారి ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సీఎం సిద్ధరామయ్య, శివకుమార్‌ సహా పార్టీ అధిష్ఠానానికి లేఖలు రాశారు. ఈసారి 38 మందిని కొత్తగా అసెంబ్లీకి పంపడం ద్వారా ప్రజలు యువ నాయకత్వం కోరుకున్నారని, ఆ మేరకు కనీసం నూతనంగా ఎన్నికైన ఐదుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని కోరారు. కొత్త ఎమ్మెల్యేల డిమాండ్‌కు పూర్తి మద్దతు ప్రకటించిన శివకుమార్‌ క్యాబినెట్‌లోకి కొత్త తరాన్ని ఆహ్వానించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -