నవతెలంగాణ- ఆర్మూర్
భారతదేశంలో విద్యార్థుల ప్రతిభను వెలికితీసే ప్రముఖ వేదిక అయిన ఇన్ఫినిటీ లెర్న్ జీనియస్ ఆధ్వర్యంలో ఒలింపియాడ్, స్కాలర్‌షిప్ పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్టు పాఠశాల యాజమాన్యం మంగళవారం తెలిపారు. ఈ పరీక్షలో 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనగా.. విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, విద్యా ప్రతిభను పెంపొందించడం ఈ పరీక్ష ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు.
ఈ పరీక్ష ద్వారా విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర విద్యార్థులతో పోటీ పడే అవకాశం పొందారు. పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఎంతో ఉత్సాహంగా పరీక్ష రాశారని అన్నారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థులను ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో పాల్గొనడానికి ప్రోత్సహించి వారి కృషిని అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు నిర్వాహకులు పాఠశాల యజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు.



