Wednesday, September 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిజామాబాద్ లో ఓం జెండా ఆవిష్కరణ

నిజామాబాద్ లో ఓం జెండా ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ నగరంలోని 76వ రావుజీ వంజరి నవయువక్ గణేష్ మండలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ చింతామణి ఉంగురాల రాజారామ్ చే ఓం జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 76వ రావుజీ వంజరి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కరిపే రాజు వంజరి మాట్లాడుతూ..గత 75 సంవత్సరాలుగా నిర్విరామంగా అంగరంగ వైభవంగా గణనాథుణ్ణి వివిధ రకాల అలంకరణలతో భక్తులను ఆకట్టుకునేలా ముస్తాబు చేస్తూ చుట్టు పక్కల ఉన్న జిల్లాల ప్రజలు సైతం తమ గణనాథుణ్ణి దర్శించుకోవడానికి వచ్చేవారని అన్నారు. ఈ సంవత్సరం కూడా నంది, లింగం, హారతి, శంకరుని, తబలా మృదంగాల విగ్రహాల ఆకృతులతో మీ ముందుకు వచ్చామని అన్నారుదేశ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి అన్నిరంగలలో విజయం సాధించేలా కృషి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో నగర ,జిల్లా స్కూల్ కమిటీ , 76వ గణేష్ ఉత్సవ కమిటీ కార్యదర్శి (హమాల్వాది సంతోషిమాత సాయిబాబా)మందిరం చైర్మన్,బోదుకం లడ్డు గంగాకిషన్,కోశాధికారి గంగోనే శ్రీనివాస్,దాయవార్ గంగాధర్,ఉపాధ్యక్షులు గంగోనే రాజు,అమందు వెంకటేష్,బడాంగే రమేష్,కేదారి చిన్నయ్య,తుడిగేన రాజేష్, శ్రవణ్ ,సహాయ కార్యదర్శులు గంగోనే సంతోష్ ,శేఖర్,గంగాధర్,సాంస్కృతిక కార్యక్రమాల కన్వీనర్ గంగోనే నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -