Thursday, December 18, 2025
E-PAPER
Homeజాతీయంప్రధాని మోడీకి ఒమన్ అత్యున్నత పుర‌స్కారం

ప్రధాని మోడీకి ఒమన్ అత్యున్నత పుర‌స్కారం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్రధాని మోడీకి ఒమన్ అత్యున్నత పుర‌స్కారం ప్రదానం చేసింది. భారత్-ఒమన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాని మోడీ చేసిన కృషికి గానూ గురువారం ఒమన్ సుల్తానేట్ ప్రత్యేకమైన పౌర పురస్కారం ‘‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’’ను సుల్తాన్ హైతం బిన్ తారిక్ ప్రదానం చేశారు. జోర్డాన్, ఇథియోపియాతో సహా మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరి దేశం ఒమన్‌లో ప్రధాని మోడీ రెండు రోజులు పర్యటిస్తున్నారు.

అంతకుముందు, ఒమన్‌లో ప్రధాని మోడీకి గార్డ్ ఆఫ్ హానర్‌తో అత్యున్నత స్వాగతం పలికారు. గతంలో క్వీన్ ఎలిజబెత్, క్వీన్ మాగ్జిమ్, చక్రవర్తి అకిహిటో, నెల్సన్ మండేలా, జోర్డాన్‌కు చెందిన కైండ్ అబ్దుల్లాకు ‘‘ ఆర్డర్ ఆఫ్ ఒమన్’’ గౌరవాన్ని ప్రదానం చేశారు. ఇప్పుడు, ప్రధాని మోడీని ఈ అవార్డుతో ఒమన్ సత్కరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -