Monday, April 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చట్టసభల్లో రాజకీయ విలువలను పెంపొందించిన ఓంకార్

చట్టసభల్లో రాజకీయ విలువలను పెంపొందించిన ఓంకార్

- Advertisement -

– మార్చి 17 చలో హైదరాబాద్ ను జయప్రదం చేయాలి
– ఎంసిపిఐ (యు) జిల్లా కార్యదర్శి జబ్బర్ 
నవతెలంగాణ – కామారెడ్డి 

ప్రస్తుత యుద్దోన్మాద మతోన్మాద అవినీతికర నేరమయ ప్రలోభాల రాజకీయాల్లో విలువలను పెంపొందించేందుకు చట్టసభల్లో ఓంకార్ పాత్ర ఎంతో ఆదర్శనీయమని, ఈ క్రమంలో చట్టసభల్లో ఓంకార్ పాత్ర అనే అంశంపై మార్చి 17న హైదరాబాదు రవీంద్ర భారతిలో సభ నిర్వహిస్తున్నట్లు ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి జబ్బర్ నాయక్  తెలిపారు. ఈ సభను జయప్రదం చేసేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) – ఎంసిపిఐ(యు) జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ నరసన్న అధ్యక్షతన పార్టీ కార్యాలయం లో నిర్వహించారు. 

ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి  జబ్బార్ మాట్లాడుతూ ఓట్లు, సీట్లు, అధికారం సంపాదననే ధ్యేయంగా రాజకీయ విలువలను బ్రష్టు పట్టించిన విధానాలను నిరసిస్తూ, నీతి నిజాయితీ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసిన మార్క్సిస్టు మహా నాయకుడు అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ జీవిత చరిత్రను ఆదర్శ రాజకీయాలను చట్టసభలలో ఆయన పాత్రను నెమరు వేసుకునేందుకు కామ్రేడ్ ఓంకార్  శత జయంతి వార్షికోత్సవాల సందర్భంగా మార్చి 17న హైదరాబాదులోని రవీంద్రభారతిలో సభ నిర్వహిస్తున్నట్లు దీనికి అధికార ప్రతిపక్ష వామపక్ష పార్టీలు సామాజిక సంఘాల ముఖ్య నాయకత్వాన్ని ఆహ్వానించినట్లు ఈ సభను జయప్రదం చేసేందుకు పార్టీ కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని, తగిన విధంగా సమీకరణ చేయాలని కోరారు.

వర్గ సామాజిక ప్రజా ఉద్యమాలను ఉదృతం చేసి నీతి నిజాయితీ ప్రత్యామ్నాయ రాజకీయాలను పెంపొందించేందుకు కామ్రేడ్ ఓంకార్ అనుసరించిన పద్ధతులను, విధానాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -