Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మార్చ్ 21 న మా భగవతి విశాల్ జాగరణ్

మార్చ్ 21 న మా భగవతి విశాల్ జాగరణ్

- Advertisement -

– మా వైష్ణో దేవి మాతా జాగరణ్ మండల్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 

సనాతన సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా, దైవిక రక్షణ, కుటుంబాల ఆశీర్వాదం కోసం ప్రేమ, కరుణ, భక్తి, ధర్మం వంటి విలువలను పెంపొందించేందుకు హైదరాబాద్‌, నాంపల్లి, ఎక్షిబిషన్ గ్రౌండ్స్  లో 2026, మార్చ్ 21 న “మా భగవతి విశాల్ జాగరణ్”  ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు మా వైష్ణో దేవి మాతా జాగరణ్ మండల్, హైదరాబాద్ కోర్ కమిటీ సభ్యులు రామ్ కిషన్ అగర్వాల్, అంజనీ కుమార్ అగర్వాల్, రాకేష్ నర్సింగ్‌పురియా, సంజయ్ అగర్వాల్, ధీరజ్ అగర్వాల్,  మనీష్ అగర్వాల్, పురుషోత్తం అగర్వాల్, ముఖేష్ అగర్వాల్, రాకేష్ జలాన్, , సూర్యకమల్ జి పుత్రా, అంజనీ కుమార్ సరోగి, లు ప్రకటించారు. హైదరాబాద్‌, నాంపల్లి, ఎక్షిబిషన్ గ్రౌండ్స్  లో ఆదివారం “మా భగవతి విశాల్ జాగరణ్” ఏర్పాట్లలో భాగంగా వారు భూమి పూజ నిర్వహించి అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మార్చ్ 21 న  సాయంత్రం ఏడు గంటలకు ప్రముఖ వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం “మా భగవతి విశాల్ జాగరణ్” ప్రారంభమౌతుందని, జోధ్‌పూర్ కు చెందిన ప్రముఖ  జాతీయవాద గాయకుడు ఛోటూ సింగ్ రావ్నా న్యూఢిల్లీ కు చెందిన ప్రముఖ  భజన గాయకుడు సుమిత్ సైని, హైదరాబాద్‌కు చెందిన ప్రధాన భజన గాయకుడు భజన సామ్రాట్  మురారి దహిమా తదితరులు పూజలో భాగంగా భజనలు మరియు భక్తి గీతాలు ఆలపిస్తారని వారు తెలిపారు. సుమారు 20,000 మంది భక్తులు హాజరవుతారని, ఉచిత ప్రవేశం, ఫలహారాలు మరియు విందు, ‘ప్రసాదం’  జాగరణకు హాజరయ్యే భక్తులకు ఉచితంగా పంపిణీ చేయబడుతుందని వారు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్యెల్యేలు, ప్రముఖులు తదితరులు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందుతారని  వారు తెలిపారు. తల్లి భగవతి ఆస్థానంలో అఖండ జ్యోతి, మహాసభ, అతీంద్రియ దర్శనం, భజన గంగా, మాత నిధి, తారా రాణి కథ, ఆర్తి వంటివి జరుగుతాయని, భక్తులందరూ తమ కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో కలిసి వచ్చి తల్లి భగవతి ఆశీస్సులకు పాత్రులు అయి వారి జీవితాన్ని విజయవంతం చేసుకోవాలని వారు  విజ్ఞప్తి చేసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -