Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయం'మోడీ, అమిత్‌ షా'పైప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయి

‘మోడీ, అమిత్‌ షా’పైప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయి

- Advertisement -

– ఆపరేషన్‌ కగార్‌ను రద్దుచేయాలి : అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్మెన్‌ విమలక్క
నవతెలంగాణ -ములుగు

దేశ సంపద దోపిడీ కోసం మోడీ, అమిత్‌ షా చేస్తున్న క్రూర మానవ మరణా హౌమంపై ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లో ఉందని అరుణోదయ సాంస్కృతిక సమైఖ్య చైర్మెన్‌ విమలక్క అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలో అరుణోదయ సాంస్కృతిక సమైఖ్య ఆధ్వర్యంలో ఆపరేషన్‌ కంగార్‌కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విమలక్క హాజరై మాట్లాడారు. ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే రద్దుచేయాలని, మధ్య భారతంలోని పోలీస్‌ సాయుధ బలగాలను వెనక్కి రప్పించాలని, బీజపూర్‌, నారాయణపూర్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ(మావోయిస్టు) నాయకులు నంబళ్ల కేశవరావుతోపాటు మరో 26మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని, కేంద్రప్రభుత్వం తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరారు. ఆదివాసీలపై జరుగుతున్న దాడులు, మానవ హననంపై ప్రజలు, ప్రజస్వామ్యవాదులు ఖండించాలన్నారు. అంబానీ, అదానీల క్షేమం తప్ప ప్రజల గోసలు ఈ పాలకులకు పట్టవన్నారు. ఆదివాసులను, విప్లవ కారులను కాపాడుకోవడానికి ఇంటికి ఒక్కరు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం విమలక్క, ప్రసాదన్న, మండల యుగేందర్‌, వెల్తురు సదానందం, పట్లోళ్ల నాగిరెడ్డి, మల్లేష్‌, నున్న అప్పారావు, ప్రతాప్‌ తదితరులు ములుగు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అరుణోదయ సాంస్కృతిక కళాకారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad