Saturday, April 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇసుక తవ్వకాల ఆదాయంపై

ఇసుక తవ్వకాల ఆదాయంపై

- Advertisement -

తప్పుడు గణాంకాలు
బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇసుక తవ్వకాల ఆదాయంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పుడు గణాంకాలు చెప్తున్నదని బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ విమర్శించారు. ముఖ్యమంత్రి సీపీఆర్వో మల్సూర్‌ దీనిపై సమాధానం చెప్పాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ఆదాయంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయనీ, వాటిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రం ఏర్పడక ముందు (2014కు ముందు) కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలో ఇసుక తవ్వకాల ద్వారా వచ్చిన ఆదాయం కేవలం రూ.39 కోట్లేనని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలతో ఇసుక ఆదాయం గణనీయంగా పెరిగి, ఒక్క ఏడాదిలోనే రూ.886 కోట్లకు చేరిందని వివరించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఇసుక ధర టన్నుకు రూ.645 మాత్రమే ఉండి ప్రజలకు అందుబాటులో ఉంచబడిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -