Wednesday, January 14, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమరణం అంచుల్లో

మరణం అంచుల్లో

- Advertisement -

అదొక మాయా ప్రపంచం…
అక్కడికి సరదాగా
సమూహాలై చేరుతారు
మరణం అంచుల్లో నిలబడి
నిషా కళ్లతో రంగుల కలల్ని కనడానికి
దిగాలు పడతారు, తపిస్తారు,
వేదన పడతారు, తల్లడిల్లుతారు-
ఎందుకంటే అది మత్తు సామ్రాజ్యం.
అక్కడ అందరూ బంధీలే కాదు,
బానిసలు కూడా.
ఆ మత్తు ఒళ్లంతా ఆవహించి
నిషాను ఎక్కిస్తుంది,
గమ్మత్తు చేస్తుంది,గల్లంతు చేస్తుంది.
ఆ మత్తులో మునిగిన బతుకు
ఉరితాడుకు బిగుసుకుంటుంది.
బాల్యం బలిపీఠమెక్కి కోకైన్‌ కొక్కానికి
తలకిందులుగా వేలాడి
మృత్యువు ఒడిని చేరుతుంది
కన్నవారి కన్నీటి రుధిరదారలు
ఏరులై పారుతుంటాయి
అదంతా ఓ మాయాజాలం-
స్వార్థం గుప్పిట్లో మారకద్రవ్యమై
ఎన్నో చేతులు మారుతుంది
మీ నిఘాకు దొరికితే
దాని మూలాన్ని సమాధి చేయండి
దేశ భవిష్యత్తుకు పునాది అయిన
యువతను కాపాడండి..

– నెల్లుట్ల సునీత, 7989460657

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -