Sunday, April 5, 2026
E-PAPER
Homeకవితఏ గాలి కెగిరిపోతానో!?

ఏ గాలి కెగిరిపోతానో!?

- Advertisement -

ఎందుకో నా కొక్కక్క సారి
అనిపిస్తూంటుంది…
చిన్నప్పట్నుంచే
ఎత్తుకొంటూ వచ్చాను
వీపు మీద
పుస్తకాల బరువు
దానికి బదులు
ఇటుకలు మోసుకుంటే
ఎప్పుడో కట్టుకోబడేది
నా ఇల్లు!
నిరుద్యోగి అయినా
తల దాచుకోవడానికి
ఓ ఆసరా అయిన ఉండేది
పస్తులున్న
తనువుకు చాలని
బట్టలు వేసుకున్న
ఇంట్లో ఓ
గౌరవమైన మిగిలేది!
బజారు పాలైయ్యెది
కాదు బ్రతుకు!
బయటికెళ్లడానికి సిగ్గేసిన
జనాల మైకపు కండ్లకు
చూపులు తప్పించుకున్న
ఇంటికెలా తిరిగొస్తానో
పగలల్లా బజారులో
నాలుగు పైసల కోసం
చేతులు చాపుతే
నా చేతులు లాగిన వాళ్లెందరో!
మానం సంగతి దేవుడెరుగు
ప్రాణం ఉంటుందో
పోతుందనో భయం!
గ్రాడ్యుయేట్‌ నని
చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తోంది
ఎన్నో చోట్లా ‘అప్లై అప్లై’
చివరికి అన్నీ చోట్ల
‘నో రిప్లై నో రిప్లై’
ఇంట్లో ముసలవ్వ
కుక్కి మంచంలో
కీలుతూ మూలుగుతూ
అలమటిస్తోంది ఆకలితో
అద్దె గుడిసె ముందున్న
వేప చెట్టు కింద
ముసలి నాన్న
ఈగల మబ్బులో
ఈదుకొంటూ
తటపటాయిస్తున్నాడు
అదేదో రోగం తో
ఊపిరి పీల్చుకో లేక
ఇప్పుడా అప్పుడా మరెప్పుడో
అంటూ ఆకాశం వైపే
కండ్లప్పరిస్తూ…!
పైన ఆకాశం
కింద నేల
మధ్యలో మాయ గాలి
ఎప్పుడు ఏ గాలి కెగిరిపోతానో?
పైగా.. ముసలి అవ్వ
రోగి నాన్న
వాళ్ల బ్రతుకేమవుతూందనే
బెంగ!?

అమ్జద్‌, 73335 92686

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -