Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కేరళ సంస్కృతికి 'ఓనమ్' ప్రతీక

కేరళ సంస్కృతికి ‘ఓనమ్’ ప్రతీక

- Advertisement -

ఓనమ్ పండుగ ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి..
నవతెలంగాణ – డిచ్ పల్లి

కేరళ రాష్ట్ర మలయాళీ ప్రజల సంస్కృతి, సంప్రదాయానికి ‘ఓనమ్’ పండగ ప్రతీకగా నిలుస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. డిచ్ పల్లి మండలంలోని బర్దీపూర్ శివారులోని తిరుమల నర్సింగ్ అకాడమీ లో గురువారం నిర్వహించిన ‘ఓనమ్’ పండగ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి పండుగ ను ప్రారంభించారు. కేరళ రాష్ట్ర యువతీ, యువకులు తమ సంప్రదాయ దుస్తులు ధరించి ఆకర్షణగా నిలిచారు. కేరళ డ్రమ్ వాయిద్యం చాలా సేపు వాహించి కార్యక్రమంలో ఎంతో ఉత్సాహం నింపారు. కేరళ నృత్యం అహుతుల్ని ఎంతగానో అలరించింది. ఉట్టికొట్టే ఆట ఉత్సాహం నింపింది. వామనుడి అవతారంలో పాతాళంలోకి వచ్చిన విష్పుమూర్తి చేత అణచివేయబడ్డ బలిచక్రవర్తి ఒక కోరిక అడుగుతాడు.

బలి చక్రవర్తి కోరిక మేరకు విష్ణుమూర్తి వరమిస్తాడు. ప్రతీ ఏడాది బలి చక్రవర్తి తన ప్రజలను కలుసుకునేందుకు వచ్చేలా వరమిస్తాడు. ఆత్మరూపంలో భూమిపైకి వస్తాడని కేరళీయుల ప్రగాడ నమ్మకం. ఈ పూరాణ కథను మలయాళీలు ప్రదర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేళల నృత్యం ఎంతగానో ఆకట్టు కుందన్నారు. తాను వైద్యుడినేనని, నర్సింగ్ విద్య అభ్యసిస్తున్న మీకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పారా మెడికల్ విద్యా సంస్థలు ఉండాలని ఎంతో ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. కరోనా సమయంలో తిరుమల సంస్థల అధినేత పరమేశ్వర్రెడ్డి ఎంతో సేవ చేశారని,నాటి నుండి నేటి వరకు విద్యాదానం చేస్తున్నారని ప్రశంసించారు. తిరుమల నర్సింగ్ అకాడమీ ఛైర్మన్ డాక్టర్ పరమేశ్వర్రెడ్డి, కరస్పాండెంట్ పద్మావతి, ప్రిన్సిపల్ డాక్టర్. ప్రతిభ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్, నర్సయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, నాయకులు శేఖర్ గౌడ్, సాయిరెడ్డి, ధర్మాగౌడ్, వాసు బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad