Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'మరొక్కసారి'.. ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ

‘మరొక్కసారి’.. ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ

- Advertisement -

నరేష్‌ అగస్త్య, సంజనా సారథి ప్రధాన పాత్రల్లో నటించిన ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’. సి.కె.ఫిల్మ్‌ మేకర్స్‌ బ్యానర్‌పై బి.చంద్రకాంత్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం నితిన్‌ లింగుట్ల. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.
ఈ మూవీకి భరత్‌ మాంచి రాజు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలుం టాయి. ఈ పాటలను టాలీవుడ్‌ టాప్‌ సింగర్లు కార్తిక్‌, ప్రదీప్‌ కుమార్‌, దేవన్‌ ఏకాంబరం, జాస్సీ గిఫ్ట్‌ వంటి వారు పాటల్ని పాడారు. ఇప్పటికే పాటలకు సంబం ధించిన చిత్రీకరణ కూడా పూర్తయింది. అందమైన ప్రేమ కథా చిత్రానికి విజువల్స్‌ మరింత అందాన్ని తీసుకు రాబోతోన్నాయి. ఈ చిత్రాన్ని కేరళ, సిక్కిం, టిబెట్‌ సరిహద్దు ప్రాంతాల్లో చిత్రీకరించారు.
ఇంత వరకు ఏ ఇండియన్‌ సినిమా కూడా షూటింగ్‌ చేయనటువంటి గురుడోంగ్మార్‌ లేక్‌ వంటి ప్రదేశంలో ఈ ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోవడం విశేషం.
5,430 మీ. ఎత్తులో ఉండే గురుడోంగ్మార్‌ లేక్‌లో షూటింగ్‌ చేసిన మొట్టమొదటి ఇండియన్‌ మూవీగా ఈ చిత్రం నిలిచింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ వచ్చింది. తాజాగా రిలీజ్‌ చేసిన టైటిల్‌ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ పోస్టర్‌ను చూస్తుంటే ఓ ఆహ్లాదకరమైన ప్రేమ కథను చూడబోతోన్నామని అర్థం అవుతోంది. త్వరలోనే చిత్రానికి సంబంధించిన రిలీజ్‌ డేట్‌ను ప్రకటించనున్నారు అని చిత్రయూనిట్‌ తెలిపింది.
బ్రహ్మాజీ, సుదర్శన్‌, వెంకట్‌, వెంకట్‌ కాకమాను, దివ్యవాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్‌: రోహిత్‌ బచు, ఎడిటర్‌్‌: చోటా కే ప్రసాద్‌.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img