ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
నవతెలంగాణ – ఆలేరు
కమ్యూనిస్టులు ఒక్కరున్నా 100 మందితో సమానమని ప్రభుత్వ బీర్ల ఐలయ్య కొనియాడారు. ఆలేరు లోని ఒకటో వార్డ్ లో బుధవారం సంతోషిమాత ఆలయంలో పూజలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీపీఐ(ఎం) కార్యకర్తలు గుంపుగా వచ్చి కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న ఆనందంలో కమ్యూనిస్టు పార్టీలు ప్రశ్నించే గొంతుకలని వారి అవసరం ప్రస్తుతం దేశానికి ఎంతో ఉందన్నారు. ఆలేరు పట్టణాన్ని అన్ని వార్డులు అభివృద్ధి చేసేందుకు తాను ప్రత్యేక శ్రద్ధ పెడతానన్నారు.
ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధి నోచుకోకుండా చేసిన బి ఆర్ ఎస్ పార్టీని11వ తేదీన జరిగే ఎన్నికల్లో ఆలేరు పెద్దవాగులో బొంద పెట్టాలన్నారు. అభివృద్ధి కోసం అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కౌన్సిలర్ చింతల ఫణి సునీత శ్రీనివాస్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ఓటర్లను వేడుకున్నారు. 8 వార్డు నుండి 12 వార్డు వరకు వరుసగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు సీపీఐ(ఎం) కార్యకర్తలు ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచార నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మోత్కుపల్లి నరసింహులు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి, టిసిసిపి కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, ఆలేరు పట్టణ అధ్యక్షులు ఎం ఏ ఏజాస్, మండల పార్టీ అధ్యక్షులు కొండ్రాజు వెంకటేశ్వర రాజు, సీపీఐ(ఎం) జిల్లా ఎంఏ ఇక్బాల్, మొరిగాడి రమేష్, మాజీ సర్పంచ్ జూకంటిపాలు వడ్డేమాన్, బాలరాజు, చేన్న రాజేష్, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.



