రోజుకొకటి…

పరగడుపున ఓ వెల్లుల్లి రెబ్బ తింటే శరీరంలో అద్భుత మార్పులు కనిపిస్తాయి. పచ్చి వెల్లుల్లి రెబ్బ తింటే ఆరోగ్యానికి మంచిది. జలుబు వంటివి వెల్లుల్లి తింటే త్వరగా నయం అవుతాయి. ఇందులో ఉండే యాంటీ బయోటిక్‌ గుణాలు అనేక అనారోగ్య సమస్యలను తేలిగ్గా నయం చేస్తాయి. అజీర్ణం, హైబ్లడ్‌ ప్రెజర్‌, సాధారణ జలుబుని చిటికెలో నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని వేగంగా పెంచుతుంది. ఇందులో ఉండే అల్లిసిన్‌ కీలకమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. చాలా మంది వెల్లుల్లిని ప్రతి కూరలో ఉపయోగిస్తారు. అసలు ఈ వెల్లుల్లిని ఉదయాన్నే తినడం వల్ల పొందే ఉపయోగాలేంటో చూద్దాం..

 వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్‌ రోగ నిరోధక శక్తి మెరుగుపరచడానికి సహాయ పడుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఓ వెల్లుల్లి రెబ్బ తింటే చాలా త్వరగా, తేలికగా వ్యాధినిరోధక శక్తి పెరగడానికి సహాయపడుతుంది.
హైబ్లడ్‌ ప్రెజర్‌తో బాధపడేవారికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఉదయాన్నే పరకడుపున ఒకటి లేదా రెండు రెబ్బలను తీసుకుంటే సమస్య తగ్గుతుంది.
చెడు కొవ్వు వల్ల కలిగే సమస్యలను నియంత్రించడంలో వెల్లుల్లి అమోఘంగా పని చేస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ని పెంచుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి బయటపడొచ్చు.
పొట్ట, యూటెరైన్‌, ప్రొస్టేట్‌ వంటి క్యాన్సర్లను దూరంగా ఉంచుతుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్‌ క్యాన్సర్‌ సెల్స్‌ని నాశనం చేస్తుంది.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరంలో హానికారక మలినా లను తొలగిస్తుంది. శరీరం డెటాక్సిఫై అవుతుంది.
వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌ కణాలను దెబ్బతినకుండా చేస్తుంది. దీంతో వయసు పెరిగే కొద్దీ వచ్చే డిమెంటియా సమస్యను అడ్డుకోవచ్చు.

Spread the love