నవతెలంగాణ హైదరాబాద్: గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటి పరిధిలో ప్రహరీ గోడ కూలి ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటి పరిధిలోని వీ కన్వెన్షన్ హాల్ ప్రహారీ గోడ సోమవారం తెల్లవారుజామున కూలింది. ఆ గోడకు ఆనుకొని అపర్ణ ఆర్ఎంసి కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు షెడ్ల వేసుకొని నివాసం ఉంటున్నారు. ఒక్కసారిగా షెడ్లపై గోడ కూలడంతో అందులో నిద్రిస్తున్న కార్మికులలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతుడు ఒరిస్సాకు చెందిన గగన్ (50)గా పేట్ బషీరాబాద్ పోలీసులు గుర్తించారు. గాయాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Heavy Rain: ప్రహరీ గోడ కూలి ఒకరు మృతి…ఐదుగురికి తీవ్ర గాయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES