Wednesday, December 17, 2025
E-PAPER
Homeక్రైమ్మైలార్ దేవుపల్లిలో ఇన్నోవా కారు భీభత్సం.. ఒకరు మృతి

మైలార్ దేవుపల్లిలో ఇన్నోవా కారు భీభత్సం.. ఒకరు మృతి

- Advertisement -

నవతెలంగాణ రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్నోవా కారు భీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. తెల్లవారుజామున 5 గంటలకు ఓవర్ స్పీడ్ తో అదుపుతప్పి జనం మీదికి దూసుకుపోయింది. రోడ్డు పక్కన ఉన్న దుప్పట్లు,రగ్గులు అమ్మే దుకాణంలో నిద్రిస్తున్న తండ్రి కోడుకులపైకి దూసుకెళ్లింది. దీంతో కుమారుడు దీపక్ మృతి అక్కడికక్కడే మృతి చెందగా.. తండ్రి ప్రభు మహరాజ్, సోదరుడు సత్తునాథ్ లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చి ప్రభు మహరాజ్ కుటుంబం వ్యాపారం నిర్వహిస్తున్నారు. శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వెళ్తున్న ఇన్నోవా కారు మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కన నిద్రిస్తున్న ప్రభు మహరాజ్ కుటుంబం పైకి దూపుకెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు పరారీ ఉండగా, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -