అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో హైదరాబాద్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. దాదాపు 5 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శివ శంకర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్ అధ్యక్షత వహించారు. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల్లో జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడానికి సంబంధించి సన్నాహక ప్రణాళికలను ఈ సందర్భంగా ప్రారంభించారు.
ఈ సమావేశంలో ఎంపికైన ప్రతినిధులకు వారి పాత్రలు, బాధ్యతలను స్పష్టంగా వివరించారు. భవిష్యత్తులో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యక్రమాలను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని అసోసియేషన్ నాయకులు తెలిపారు. అలాగే, ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఒక మంచి పని ధ్యేయమని ఈ సమావేశంలో వెల్లడించారు. అల్లు అర్జున్ ప్రతిభ, క్రమశిక్షణ, విలువలను ప్రతిబింబించే విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు కొనసాగాలని నేతలు పేర్కొన్నారు.
ప్రతి ఏడాది ఒక మంచి పని..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



