- Advertisement -
నవతెలంగాణ – మునిపల్లి
పదవ తరగతిలో శత శాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ప్రధానోపాధ్యాయులకు సూచించారు. మండలంలోని గోపులారం మరియు మునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆయన మంగళవారం నాడు సందర్శించి పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పదవ తరగతి విద్యార్థులకు జరుగుతున్న బోధన పనితీరు ఉత్తమ ఫలితాల సాధనకు చేపడుతున్న చర్యలను ఆయన ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అక్షయపాత్ర భోజనాన్నిపరిశీలించారు. ఆయన వెంట కంకోలు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తుకారాం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.
- Advertisement -



