Monday, November 24, 2025
E-PAPER
Homeక్రైమ్ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొని వంద గొర్రెలు మృత్యువాత

ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొని వంద గొర్రెలు మృత్యువాత

- Advertisement -

భయంతో వాగులో దూకి గల్లంతయిన గొర్రెల యజమాని

నవతెలంగాణ-కామారెడ్డి
కామారెడ్డి పట్టణ శివారులో ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొని సుమారు వంద గొర్రెలు మృత్యువాత పడగా ప్రాణభయంతో వాగులో దూకిన గొర్రెల యజమాని మృతిచెందాడు. రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని దేవునిపల్లికి చెందిన దర్శపు సుధాకర్‌ (35) అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి రోజు మాదిరిగానే ఆదివారం గొర్రెలు మేపడానికి కామారెడ్డి శివారులోని ఫైర్‌ స్టేషన్‌ సమీపంలో రైల్వే బ్రిడ్జి (గరండాల్‌) వద్దకి వెళ్లారు. రైలు వచ్చే విషయాన్ని పసిగట్టకుండానే గొర్రెలను పట్టాలు దాటించే ప్రయత్నం చేశారు. దాంతో వేగంగా వచ్చిన ఎక్స్‌ప్రెస్‌ రైలు.. గొర్రెల మందను ఢీకొంది. దాంతో పక్కనే ఉన్న సుధాకర్‌ రైలు తనను కూడా ఢీకొంటుందేమోనని భయపడి పట్టాల పక్కనే ఉన్న వాగులోకి దూకేశాడు. ఈ ప్రమాదంలో సుమారు వంద వరకు గొర్రెల మృత్యువాత పడ్డాయి. అయితే సుధాకర్‌ వాగులో పడిపోవడంతో అతని ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలించగా సాయంత్రం అతని మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -