Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఅనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి

అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండల పరిధిలోని గుమ్మడి వల్లి పెద్దవాగు ప్రాజెక్ట్ ఆనకట్ట పై అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి చెందారు. గురువారం ఆనకట్ట పై ఒక వ్యక్తి మృతి చెంది ఉన్న ఉదంతం పై స్థానికులు ఆ నోటా ఈ నోటా మండలం మొత్తం వ్యాపించింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీస్ లు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించడం తో ఆసుపాక కు చెందిన వీర్నాల సత్యనారాయణ(27) గా గుర్తించారు.అనంతరం ఇతని భార్య సత్యవతి గుర్తించి నిర్ధారించుకుంది.ఆమె ఇచ్చిన పిర్యాదు ప్రకారం బుధవారం రాత్రి ఇంటినుండి వెళ్ళాడని,రాత్రంతా ఎదురు చూసా మని, గురువారం ఉదయం ఇలా విగత జీవుడు గా ఉన్నట్లు తెలిసింది అని పేర్కొంది. అయితే ఇటీవల గృహం నూతనంగా నిర్మించడంతో కొన్ని అప్పులు అయినట్లు,వాటిని తీర్చే క్రమంలో మనోవేదనకు గురై ఇలా మృతి చెంది ఉంటాడని పలు గుస గుసలు వినిపిస్తున్నాయి. భార్య సత్యవతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించి విచారణ చేపట్టినట్లు ఎస్.హెచ్.ఒ ఎస్.ఐ యయాతి రాజు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad