– మృతి చెందిన అన్నదమ్ములు
– నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘటన
నవతెలంగాణ-నిర్మల్
ఇంటిలో జరిగిన చిన్న గొడవ అన్నదమ్ముల ప్రాణాలను బలి తీసుకుంది. క్షణికావేశంలో చెరువులో దూకిన అన్న, కాపాడబోయిన తమ్ముడు ఇద్దరూ మృతి చెందిన సంఘటన మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానికులు, సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ పట్టణంలోని నాయుడువాడకు చెందిన నరేష్(38), నవీన్ (36) ఇద్దరు అన్నదమ్ములు.. అమ్మనాన్న, భార్య పిల్లలతో కలిసి జీవనం కొనసాగి స్తున్నారు. నరేష్ ఓ ప్రయివేట్ కళాశాలలో ఉద్యోగం చేస్తుండగా, నవీన్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుడప్పుడు కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరిగేవి.. కాగా, మంగళవారం ఇంట్లో గొడవ జరగడంతో నరేష్ మనస్తాపానికి గురయ్యాడు. క్షణికావేశంలో బంగల్‌పేట్ వినాయక సాగర్ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అన్న వెనకాలే వెళ్లిన నవీన్.. అన్నను కాపాడేందుకు తానూ చెరువులోకి దూకాడు. దాంతో ఇద్దరు చెరువులో మునిగిపోయి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. జాలర్లతో సహాయంతో మృతదేహాలను బయటకు తీయించారు. కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు నరేష్‌కు భార్య, 7 సంవత్సరాల కుమారుడు, మూడు సంవత్సరాల కుమార్తె ఉన్నారు. మృతుడు నవీన్‌కు భార్య, మూడు సంవత్సరాల కుమార్తె ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
చెరువులో దూకి ఒకరు.. కాపాడబోయి మరొకరు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES