నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన వృద్ధురాలు కరిపే సావిత్రి బాయి బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించారు. ఈ నేపధ్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూరు సభ్యులు ఆమె కుమారుడైన జిల్లా బిసి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కరిపే రవీందర్, కుటుంబ సభ్యులతో మాట్లాడి అవగాహన కల్పించి నేత్ర దానం చేయించారు. సేకరించిన రెండు కార్నియాలను లయన్స్ ఐ హాస్పిటల్ కు అందజేసినట్లు జిల్లా లయన్స్ అదనపు కార్యదర్శి పి. లక్ష్మీ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఒక్కరి నేత్ర దానంతో ఇద్దరి అంధులకు వెలుగు ప్రసాదింపజేసిన కరిపే రవీందర్ కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కరిపే గోవర్ధన్, ఎం.కె లింగోజీ, డాక్టర్ తేజస్వి, డాక్టర్ రాజేష్ , అక్షయ్ కుమార్, పుష్ప, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఒక్కరి నేత్ర దానం ఇద్దరి అంధులకు కంటి వెలుగు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES