నవతెలంగాణ – మల్హర్ రావు : చెడు వ్యసనాలకు ప్రజలు, ముఖ్యంగా యువత దూరంగా ఉండాలని కాటారం డిఎస్పీ సూర్యనారాయణ సూచించారు. గురువారం మండలంలోని నాచారం గ్రామంలో డిఎస్పీ,సిఐ నాగార్జున రావు ఆధ్వర్యంలో కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేష్,ఎస్ఐ-2 రాజన్, ఎస్ఐలు, సివిల్ కానిస్టేబుల్స్, టీజీఎస్పి కానిస్టేబుల్స్ అందరూ సంయుక్తంగా కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.కార్డెన్ సెర్చ్ లో భాగంగా నంబర్ ప్లేట్ లేని వాహనాలు, డాక్యుమెంట్స్ లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడారు పల్లెల్లో ప్రజలు గుడుంబా, గంజాయి వంటి చెడు వ్యసనాలపై, సైబర్ క్రైమ్, బండి ఆధునిక నేరాలపై, మోటార్ వెహికల్ కు సంబంధించిన నియమ,నిబంధనాలపై,సీసీ కెమెరాలుపై,100 డయల్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసే వ్యక్తులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

 
                                    