Wednesday, February 4, 2026
E-PAPER
Homeఆదిలాబాద్చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

- Advertisement -

 నవతెలంగాణ – జన్నారం
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని హెల్త్ సూపర్వైజర్ కమలాకర్ ఏఎన్ఎం మాధవి అన్నారు. బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా డాక్టర్ ఉమాశ్రీ ప్రభుత్వ వైద్యురాలు (జన్నారం) ఆదేశాల మేరకు తపాలపూర్ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. క్యాన్సర్ బారిన పడకుండా ఆహారపు అలవాట్లు ధూమపానం మద్యపానం చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించడం జరిగింది.ఎన్సిడి కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్ వ్యాధి నీ ముందస్తుగా నిర్ధారించడం జరుగుతుందని. 14 ఏళ్ల వయసు విద్యార్థులకుHPV వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని. అలాగే మహిళలు మామోగ్రఫీ, పాప్ స్మియర్ ,పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొల్లూరి కమలాకర్ హెల్త్ అసిస్టెంట్ మాధవి ఏఎన్ఎం రమేష్ పంచాయతీ కార్యదర్శి , లలిత, విజయ ఆశా కార్యకర్త లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -