- Advertisement -
ఎస్సై భువనేశ్వర్ రావు
నవతెలంగాణ-రామారెడ్డి
విద్యార్థులు డ్రగ్స్, మద్యానికి దూరం ఉంటూ, కుటుంబ సభ్యులను వ్యసనాల వైపు వెళ్లకుండా అవగాహన కల్పించాలని గురువారం ఎస్సై భువనేశ్వర్ రావు సూచించారు. మండల కేంద్రంలోని బాలిక ఉన్నత పాఠశాలలో అమరవీరుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ పై, చెడు వ్యసనాలపై అవగాహన కల్పించి, వ్యాసరచన పోటీలను నిర్వహించి, ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -