Monday, November 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓ గోడు భవనం @ 40

ఓ గోడు భవనం @ 40

- Advertisement -

మోడల్ గ్రామంలో శిధిలావస్థ పంచాయితీ
నవతెలంగాణ – నకిరేకల్

హలో.. నమస్తే.. నేను మీ ఓ ‘ గోడు’ గ్రామ పంచాయితీ భవనాన్ని. నా వయస్సు 40 ఏండ్లు. 1954లో మూసి ప్రాజెక్టు డ్యాం నిర్మాణ సమయంలో ఈ గ్రామం పూర్తిగా ముంపుకు గురి కావడంతో 1959 నుండి 1961 వరకు అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్ శ్రవణ్ కుమార్, సర్పంచ్ కొండ కింది అప్పారెడ్డి ఆధ్వర్యంలో మోడల్ గ్రామంగా  పునర్నిర్మాణం చేశారు. ఆ తర్వాత 1984- 85 లోఅక్కినేపల్లి కిషన్ రావు సర్పంచ్ గా ఉన్న సమయంలో గ్రామపంచాయతీ(నన్ను) భవనాన్ని నిర్మించారు. నాటినుండి నేటి వరకు భవన నిర్మాణం జరిగి నాలుగు దశాబ్దాలు గడుస్తున్న కొత్త గ్రామపంచాయతీ నిర్మాణానికి అడుగు ముందుకు పడలేదు. ఈ 40 ఏళ్ల కాలంలో గ్రామ అభివృద్ధికి సంబంధించిన ప్రతి పనికి నేనే సాక్ష్యంగా నిలిచాను. శిథిలావస్థకు చేరిన తన పై పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి. స్లాబు పెచ్చులు ఊడిపోతున్నాయి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని సందిగ్ధ పరిస్థితి ఉంది. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్న స్పందించడం  లేదు. ఎలాంటి అనర్ధాలు జరగకముందే పునర్నిర్మానం చేయాలని వేడుకుంటున్నా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -